Chandrababu: చినరాజప్ప కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

  • కాకినాడలో జరిగిన వివాహం
  • వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
  • నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు కూడా హాజరు

ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కాకినాడలో ఈరోజు జరిగిన ఈ వివాహానికి హాజరైన చంద్రబాబు, నూతన వధూవరులను ఆశీర్వదించి .. శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా, హైదరాబాద్ లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు ఈరోజు సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం, హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రికి వెళ్లిన చంద్రబాబు, అక్కడి నుంచి కాకినాడ చేరుకున్నారు. 

More Telugu News