chalasani srinivas: ఈ నెల 5 నుంచి 9 వరకూ ‘ఛలో ఢిల్లీ’: 'హోదా' కోసం చలసాని శ్రీనివాస్ పిలుపు

  • గుంటూరులో ప్రత్యేక హోదాపై రాష్ట్ర స్థాయి సదస్సు 
  • ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు తెలుగువారి సత్తా చాటిచెప్పాలి
  • బీజేపీ దోస్తీ నుంచి టీడీపీ బయటపడాలి
  • ప్రత్యేక హోదాపై కేంద్ర సర్కారు స్పందించకపోతే ఈ నెల 15 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదాపై అందరూ ఐక్యంగా పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యేక హోదాపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు శివాజీ, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, జనసేన నేత రాఘవయ్యతో పాటు ఏపీ ప్రత్యేక హోదా పోరాట సమితి నేత చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ... ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు తెలుగువారి సత్తా చాటిచెప్పాలని అన్నారు. బీజేపీ దోస్తీ నుంచి టీడీపీ బయటపడాలని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర సర్కారు స్పందించకపోతే ఈ నెల 15 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 5 నుంచి 9 వరకూ ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. 

More Telugu News