KTR: కేటీఆర్‌ వ్యాఖ్యలపై నేను స్పందించడం ఇక ఇదే చివరిసారి!: జానారెడ్డి

  • జానా బాబా 40 దొంగలు అంటూ నిన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు
  • మండిపడ్డ జానారెడ్డి
  • కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించడమంటే నేను నా స్థాయి తగ్గించుకోవడమే
  • కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇక టీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుంది

నిన్న సూర్యాపేట‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఆలీబాబా 40 దొంగలు, జానా బాబా 40 దొంగలు’ అంటూ ఎద్దేవా చేసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర ప్రారంభిస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి.. కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించడమంటే తన స్థాయిని తగ్గించుకోవడమేనని, ఆయన వ్యాఖ్యలపై ఇదే చివరిగా స్పందించడమని తేల్చి చెప్పారు.

తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకువచ్చానని జానారెడ్డి తెలిపారు. తనపై విమర్శలు చేస్తోన్న వారు వాటిని గుర్తు తెచ్చుకోవాలని చురక అంటించారు. తాను గతంలో ఓ పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశానని, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇక టీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News