boney kapoor: ఎన్ని సార్లు ఫోన్ చేసినా, బోనీ ఏడుస్తూనే ఉన్నాడు: నటుడు, నిర్మాత సతీష్ కౌశిక్

  • బోనీ, నేను 30 ఏళ్లుగా మంచి స్నేహితులం
  • అంతిమ యాత్రకు ఇంత మంది రావడం ఎన్నడూ చూడలేదు
  • శ్రీదేవి ఓ అత్యుత్తమ తల్లి 
శ్రీదేవి మరణవార్త వినగానే నమ్మలేక పోయానని బాలీవుడ్ నటుడు, నిర్మాత సతీష్ కౌశిక్ అన్నారు. విషయాన్ని తెలుసుకుందామని వెంటనే బోనీ కపూర్ కు ఫోన్ చేశానని... అయితే, పెద్ద పెట్టున ఏడుపు తప్ప తనకు మరేం వినిపించలేదని చెప్పారు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా బోనీ మాట్లాడలేదని... అలా ఏడుస్తూనే ఉన్నారని తెలిపారు. చివరకు తానే ఫోన్ కట్ చేశానని అన్నారు. గత 30 ఏళ్లుగా బోనీ, తాను ఇద్దరం మంచి స్నేహితులమని... అందుకే అతనికి నేరుగా ఫోన్ చేశానని చెప్పారు. బోనీ ఉన్న పరిస్థితిని చూసి తాను తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ వ్యక్తి అంతిమ యాత్రకూ ఇంత మంది జనాలు రావడం తాను చూడలేదని సతీష్ కౌశిక్ అన్నారు. శ్రీదేవి మరణంతో దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పారు. ఆమె మరణం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిందని అన్నారు. ఒక మంచి తల్లిగా ఉండటం ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని చెప్పారు. ఇద్దరు కుమార్తెల విషయంలో ఆమె అత్యుత్తమమైన తల్లిగా నిరూపించుకున్నారని అన్నారు.
boney kapoor
Sridevi
sathish kowshik
bollywood

More Telugu News