idea: ఐడియా నుంచీ 4జీ వోల్టే సేవలు... తొలుత ప్రయోగాత్మకంగా కంపెనీ ఉద్యోగులకే

  • తర్వాత కస్టమర్లకు
  • హైదరాబాద్, నాగ్ పూర్, గోవా తదితర 30 పట్టణాల్లో ఆరంభం
  • ఏప్రిల్ చివరికి అన్ని సర్కిళ్లకూ

రిలయన్స్ జియోతో మొదలైన 4జీ వోల్టే సేవలు ఆ తర్వాత ఎయిర్ టెల్, ఇప్పుడు ఐడియా వరకు విస్తరించాయి. ఐడియా 4జీ వోల్టే సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కొన్ని సర్కిళ్ల పరిధిలోనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా ఒక్కో సర్కిల్ పరిధిలో ఈ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

నాలుగు సర్కిళ్ల పరిధిలో 30కు పైగా పట్టణాల్లో ఐడియా 4జీ వోల్టే సేవలను ఆరంభించింది. హైదరాబాద్, రాజ్ కోట్, సూరత్, అహ్మదాబాద్, నాగ్ పూర్, నాసిక్, గోవా, పునె, త్రివేండ్రం, క్యాలికట్, కోచి తదితర పట్టణాలు ఇందులో ఉన్నాయి. ఏప్రిల్ ఆఖరుకు 20 సర్కిళ్లలోనూ 4జీ వోల్టే సేవలను తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. 

More Telugu News