whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్!

  • నకిలీ, స్పాం మెసేజ్‌లను అరికట్టవచ్చు
  • ఈ ఫీచర్ ద్వారా 'ఫార్వర్డ్ మెసేజ్' అవునో కాదో తెలుస్తుంది
  • ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ 2.18.67 లో లభ్యం

వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను ప్రవేశపెడుతూనే ఉంటుంది. తాజాగా వాట్సాప్‌లో నకిలీ, స్పాం మెసేజ్‌లను అరికట్టడం కోసం 'ఫార్వర్డ్ మెసేజ్‌' పేరిట ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. వాట్సాప్ లో స్నేహితుల నుంచి గానీ, గ్రూప్‌ నుంచి కానీ వచ్చే మెసేజులు క్రియేట్ చేసి చేస్తున్నారా? లేక ఫార్వార్డ్ చేస్తున్నారా? అనేది తెలుసుకోవడం కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్ వల్ల ఎవరైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అది 'ఫార్వార్డెడ్ మెసేజ్' అని చూపిస్తుంది. ప్రస్తుతం పరీక్షా దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ 2.18.67 అప్‌డేట్‌‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అలాగే త్వరలో స్టిక్కర్స్ ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.







More Telugu News