sbi: ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకున్న వారిపై భారం... లెండింగ్ రేటును పెంచిన బ్యాంకు

  • ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతానికి చేరిక
  • ఇప్పటి వరకు 7.95 శాతమే
  • అరశాతం వరకు రుణాలపై వడ్డీ రేటు పెరిగే అవకాశం

రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్ దారులను మురిపించిన ఎస్బీఐ ఒక్కరోజు తిరగకుండానే రుణగ్రహీతలపై భారం మోపింది. రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లకు ప్రామాణికమైన ఎంసీఎల్ఆర్ ను పెంచుతూ ఈ రోజు నిర్ణయం ప్రకటించింది. ఈ రోజు నుంచే పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి.

 దీంతో ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారితోపాటు కొత్తగా రుణాలు తీసుకోబోయే వారు మరికాస్త అధికంగా ఈఎంఐ చెల్లించుకోవాల్సి ఉంటుంది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా, ఈ విధానంలో రుణాలపై వడ్డీ రేట్లను ఎస్ బీఐ పెంచడం ఇదే ప్రథమం. ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్ ను 7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు అరశాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News