prashant karmakar: మహిళా స్విమ్మర్లను వీడియో తీసిన కోచ్ కర్మాకర్ పై మూడేళ్ల నిషేధం

  • అనైతిక, వికృత ప్రవర్తనతో నిషేధానికి గురైన స్విమ్మింగ్ కోచ్ ప్రశాంత్ కర్మాకర్‌
  • మహిళా పారా స్విమ్మర్లు స్విమ్మింగ్ చేస్తుండగా అనుమతి లేకుండా వీడియో తీసినందుకు నిషేధం
  • దేశానికి పారా క్రీడల్లో 37 పతకాలు తెచ్చిన ప్రశాంత్ కర్మాకర్

భారత ప్రముఖ పారా స్విమ్మర్, ప్రస్తుత పారా మహిళా స్విమ్మర్ల కోచ్ ప్రశాంత్ కర్మాకర్‌ అనైతిక, వికృత ప్రవర్తనతో నిషేధానికి గురయ్యాడు. మహిళా పారా స్విమ్మర్లు స్విమ్మింగ్ చేస్తుండగా అనుమతి లేకుండా వీడియో తీసినందుకు గాను కర్మాకర్ ను మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ భారత పారాలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అథ్లెట్ స్థాయి నుంచి కోచ్‌ గా మారిన కర్మాకర్‌ తన ప్రదర్శనతో దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టాడు.

అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో భారత్ కు 37 ప‌త‌కాలు తెచ్చిపెట్టిన కర్మాకర్, 2009, 2011లో స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్‌ గా నిలిచాడు, 2011లో అర్జున అవార్డు, 2014లో భీమ్ అవార్డు, 2015లో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులను గెలుచుకున్నాడు. అర్జున అవార్డు పొందిన తొలి భారత పారాలింపిక్ క్రీడాకారుడు కూడా కర్మాకరే కావడం విశేషం. 2016 రియో పారాలింపిక్స్ గేమ్స్‌ కు స్విమ్మింగ్ టీమ్ కోచ్‌ గా కూడా వ్యవహరించాడు. అంతపేరు సంపాదించుకున్న కర్మాకర్ అనైతిక ప్రవర్తనతో మూడేళ్ల నిషేధానికి గురయ్యాడు. 

More Telugu News