winter: ఈ వేసవిలో కరువే! శీతకన్నేసిన ఈశాన్య రుతుపవనాలు

  • శీతాకాలంలో చాలా తక్కువ వర్షాలు
  • సాధారణం కంటే 67 శాతం తక్కువ
  • వేసవిలో నీటి ఎద్దడి ప్రమాదం
ఈశాన్య రుతుపవనాలు ఈ సారి చిన్న చూపు చూశాయి. దేశంలో ఈశాన్య రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతంలో కురిసింది కేవలం 33 శాతమే. 67 శాతం మేర లోటు వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఈ రోజు తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో వర్షాలే లేవు. దీంతో రానున్న వేసవిలో తీవ్ర నీటి కరువు రానుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హిమపాతంలోనూ లోటు నెలకొనడం వాతావరణ నిపుణులను కలవరపరుస్తోంది. శీతాకాలంలో వర్షాలు తక్కువగా ఉండడం, మరీ ముఖ్యంగా ఉత్తర భారత్ లో ఈ పరిస్థితికి వెస్టర్న్ డిస్టర్ బెన్సెస్ కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
winter
rain
defecit

More Telugu News