Chandrababu: 'చంద్రబాబు యువసేన' ఫేస్ బుక్ ఖాతాలో రచ్చ చేసిన టీడీపీ కార్యకర్తలు!

  • కిమిడి మృణాలిని, మీసాల వరహాల నాయుడి మధ్య విభేదాలు
  • ఫేస్ బుక్ ఖాతాలో అసభ్యకర పోస్టులు
  • ఒకరి అరెస్ట్ - స్టేషన్ ఎదుట హైడ్రామా

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, విశాఖ జిల్లా జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడి మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరడంతో, వారి అనుచరగణం 'చంద్రబాబు యువసేన' ఫేస్ బుక్ ఖాతాలో ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ అసభ్యకర పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఈ వ్యవహారం గంటగంటకూ ముదిరిపోవడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోస్టులు పెడుతున్న ఓ టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది.  

'చంద్రబాబు యువసేన' ఫేస్ బుక్ ఖాతాలో కంచుపల్లి అశోక్‌ అలియాస్ రమేష్, ఎమ్మెల్యే వర్గీయులు బొత్స గోపీనాథ్‌, గవిడి శ్రీనివాసరావు తదితరులు అసభ్యకర పోస్టులు పెట్టారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులూ రాకపోయినా కేసులో అశోక్ ను అరెస్ట్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఆయన కుటుంబీకులు, పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయగా, చివరకు దిగివచ్చిన పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.

కాగా, గుండె జబ్బుతో బాధపడుతున్న తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఆ గాయాలకు తాను ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని, తప్పు చేసిన అందరినీ పిలిపించి మాట్లాడకుండా, తానొక్కడినే వారెంట్ లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని రమేష్ ప్రశ్నించాడు. వివాదాన్ని సద్దుమణిగేలా చూసేందుకు జిల్లా నేతలు రంగంలోకి దిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News