JORDAN king: ప్రధానితో భేటీ కానున్న జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా

  • హైదరాబాద్ హౌస్ లో చర్చలు
  • రక్షణరంగ ప్రణాళికకు తుదిరూపం
  • ఆరోగ్యం, ఐటీ రంగాల్లో సహకారంపై దృష్టి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేడు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా భేటీ కానున్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. ప్రధానంగా రక్షణ, భద్రత, పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. ఇస్లామిక్ వేర్పాటువాదానికి అబ్దుల్లా వ్యతిరేకి అనే ముద్ర ఉంది. రక్షణ ప్రణాళిక ఒప్పందానికి నేతలు తుదిరూపం ఇవ్వనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా దృష్టి పెట్టనున్నారు. భారత్ కు చెందిన 20 టెక్స్ టైల్ కంపెనీలు జోర్డాన్ లో 30 కోట్ల డాలర్ల మేర పెట్టుడులు పెట్టి ఉన్నాయి. ఆరోగ్యం, ఐటీ రంగాల్లోనూ సహకారంపై వీరు చర్చించనున్నారు. రాజు అబ్దుల్లా మంగళవారమే భారత్ కు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News