Rajanikant: 'కాలా' టీజర్ కోసం.. రజనీ అభిమానులు మరో 24 గంటలు ఆగాల్సిందే!

  • నేడు విడుదల కావాల్సిన కాలా టీజర్
  • రేపటికి వాయిదా వేస్తున్నామన్న ధనుష్
  • జయేంద్ర మృతికి సంతాప సూచకంగానే
నేడు విడుదల కావాల్సిన రజనీకాంత్ కొత్త చిత్రం 'కాలా' టీజర్ విడుదలను రేపటికి వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాత ధనుష్ ఓ ప్రకటనలో తెలిపారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతికి సంతాప సూచకంగా టీజర్ విడుదలను ఒక రోజు వాయిదా వేస్తున్నామని ఆయన తెలిపాడు.

టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులకు క్షమాపణలని అన్నాడు. మరికొన్ని గంటలు వేచి చూడాలని కోరాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. కాగా, రజనీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళనాట ఫేమస్ డాన్ కరికాలన్ అలియాస్ కాలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది.
Rajanikant
Teaser
Postphoned
Dhanush
Twitter

More Telugu News