Virat Kohli: కేప్ టౌన్ నీటి కష్టాలకు చలించిన కోహ్లీ... డుప్లెసిస్ తో కలసి తన వంతు సాయం చేసిన వైనం!

  • కేప్ టౌన్ లో తీవ్ర నీటి ఎద్దడి
  • వ్యక్తికి రోజుకు 50 లీటర్ల నీరు మాత్రమే
  • 8,500 డాలర్ల విరాళాన్నిచ్చిన కోహ్లీ, డుప్లెసిస్

ఇటీవల భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించిన వేళ, కేప్ టౌన్ నగరంలో నెలకొన్న నీటి ఎద్దడిని, అక్కడి నీటి వాడకంపై నిబంధనలను చూసి, స్వయంగా కష్టాలను అనుభవించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన వంతు సాయం చేశాడు. నగర వాసులకు బాటిళ్లలో మంచినీటిని అందించేందుకు, కొత్త బావులను తవ్వించేందుకు 8,500 డాలర్లను (లక్ష రాండ్లు) దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తో కలసి అందించాడు.

గివర్స్ ఫౌండేషన్ కు ఈ డబ్బును అందించిన ఆయన, వీటితో నీటి కష్టాలు కొంతమేరకైనా తీరుతాయని భావిస్తున్నట్టు తెలిపాడు. కాగా, కోహ్లీ, డుప్లెసిస్ చేసిన సాయానికి గివర్స్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ సొలిమాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ నిధులతో నీటి సౌకర్యం ఏ మాత్రమూ లేని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బోరు బావులను తవ్విస్తామని ఆయన తెలిపారు. కాగా, గత నెలలో కేప్ టౌన్ లో ఒక్కో వ్యక్తికి రోజుకు కేవలం 50 లీటర్ల నీటిని మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలిగిందన్న విషయం తెలిసిందే.

More Telugu News