Rajkumar Santoshi: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి

  • ధ్రువీకరించిన నానావతి ఆసుపత్రి  
  • రొటీన్ చెకప్‌లో భాగమేనని ట్వీట్ చేసిన సంతోషి
  • అవార్డు విన్నింగ్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ముంబైలోని నానావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎటువంటి సమస్యలేదని, రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వచ్చినట్టు రాజ్‌కుమార్ ట్వీట్ చేశారు.

సంతోషి ప్రస్తుతం రణ్‌దీప్ హుడాతో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గతంలో ఆయన ఘాయల్ (1990), దామిని (1993), అందాజ్ ఆప్నా ఆప్నా (1994), ఘాతక్ (1996), పుకార్ (2000), ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), ఫతా పోస్టర్ నిక్లా హీరో (2013) వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పుకార్ చిత్రం జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా అవార్డు గెలుచుకుంది. భగత్ సింగ్ సినిమాకు ఉత్తమ సినిమా అవార్డు అందుకున్నారు.
Rajkumar Santoshi
Bollywood
Director

More Telugu News