Telugudesam: మంత్రికి ఫిర్యాదు చేసినా భూ అక్రమాలు ఆగట్లేదు : రావెల కిశోర్ బాబు

  • భూ అక్రమాలపై మంత్రి ప్రత్తిపాటికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
  • ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారు
  • మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయి : రావెల ఆరోపణలు
తన నియోజకవర్గమైన ప్రత్తిపాడులో జరుగుతున్నభూ అక్రమాలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని టీడీపీ నేత రావెల కిశోర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడిపాలెం క్వారీల్లో ఈరోజు ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ, మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని, ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని ఆరోపించారు. తన నియోజవర్గంలో జరిగిన భూ అక్రమాల్లో తన పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
Telugudesam
Ravela Kishore Babu

More Telugu News