ap assembly: మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వస్తారనుకుంటున్నా: స్పీకర్ కోడెల
  • భద్రతా ఏర్పాట్లపై మండలి చైర్మన్ ఫరూక్ తో కలసి సమీక్ష
  • ప్రజాప్రతినిధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులకు సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలను మార్చి 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ కోడెల, శాసన మండలి చైర్మన్ ఫరూక్ బుధవారం అమరావతిలో సమీక్షించారు. అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరానని.. వారు సమావేశాలకు వస్తారని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని, ప్రజాప్రతినిధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.
ap assembly
assebly session
speaker kodela shivaprasadrao

More Telugu News