mahammad kaife: తన ఆల్ టైమ్ గ్రేట్ జట్టులో ద్రవిడ్ కు చోటివ్వని మహ్మద్ కైఫ్

  • బస్ డ్రైవర్ అంటూ నాసర్ హుస్సేన్ స్లెడ్జింగ్ చేశాడు
  • పాక్ దిగ్గజం వసీం అక్రమ్ గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు
  • ఆల్ టైమ్ గ్రేట్ జట్టు ప్రకటించిన కైఫ్

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కు వెటరన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆల్ టైమ్ జట్టులో స్థానం కల్పించకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహ్మద్ కైఫ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత రాజకీయాల్లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా స్విట్జర్లాండ్ లో నిర్వహించిన ఐస్ క్రికెట్ ఆడిన కైఫ్ సోషల్ మీడియాలో అభిమానులతో గతస్మృతులను నెమరేసుకున్నాడు.

 ఈ సందర్భంగా 2002 నాట్‌ వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు నాసర్‌ హుస్సేన్‌ స్లెడ్జింగ్‌ కు పాల్పడ్డాడని అన్నాడు. ఆ సమయంలో తనను 'బస్‌ డ్రైవర్‌' అని పిలిచాడని చెప్పాడు. దానికి యువరాజ్‌ సింగ్‌, తాను కలిసి మ్యాచ్‌ అనంతరం రైడ్‌ కు తీసుకెళ్తాం అని సమాధానమిచ్చామని కైఫ్ గుర్తు చేసుకున్నాడు.

ఇక తానందుకున్న గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే... ‘ఒకప్పటి లెజండరీ ఫీల్డర్‌, ఎప్పటికీ లెజండరీ ఫీల్డర్‌, ఫినిషరే’ అని ఈ మధ్యే జరిగిన ఐస్ క్రికెట్ సందర్భంగా పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ అన్నాడని ఆనందం వ్యక్తం చేశాడు. తన దృష్టిలో ఆల్ టైమ్ గ్రేట్ టీమిండియా జట్టులో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, సౌరవ్ గంగూలీ, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, అనిల్‌ కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్‌ లుంటారని అన్నాడు. ద్రవిడ్ కు కైఫ్ స్థానం కల్పించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. 

  • Loading...

More Telugu News