Hyderabad: కోఠిలో నాలుగు సంచుల్లో తరలిస్తున్న నగదు పట్టివేత

  • కోఠి మెడికల్ కాలేజీ వద్ద పోలీసుల తనిఖీలు
  • నాలుగు బస్తాల్లో డబ్బుతో అటుగా వెళ్తున్న ఆటో
  • డబ్బు స్వాధీనం.. డ్రైవర్ విచారణ
హైదరాబాదులో వాణిజ్య కేంద్రంగా పేర్కొనే కోఠిలో భారీ మొత్తంలో నగదు పట్టుబడడం కలకలం రేపింది. దాని వివరాల్లోకి వెళ్తే... కోఠిలోని వైద్య కళాశాల వద్ద నేటి ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అటుగా నాలుగు నగదు నిండిన సంచుల (బస్తాలు) ను తీసుకెళ్తున్న ఆటో వారికి పట్టుబడింది. దీంతో నగదును తరలిస్తున్న ఆటోడ్రైవర్ ను అదుపులోకి తీసుకుని, నాలుగు బస్తాల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు, డ్రైవర్ ను సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 
Hyderabad
kothi
money

More Telugu News