raj tarun: రాజ్ తరుణ్ 'లవర్' సినిమా రిలీజ్ డేట్ ఖరారు

  • రాజ్ తరుణ్ హీరోగా 'లవర్'
  • కథానాయికగా రిద్ధి కుమార్ 
  • జూన్ 14న భారీ స్థాయి విడుదల

యూత్ లో మంచి క్రేజ్ వున్న కథానాయకుల జాబితాలో రాజ్ తరుణ్ పేరు కూడా కనిపిస్తుంది. ఆ మధ్య వరుస హిట్లతో సందడి చేసిన రాజ్ తరుణ్, ఈ మధ్య అభిమానులను నిరాశపరుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దిల్ రాజు నిర్మాణంలో 'లవర్' సినిమా చేస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రిద్ధి కుమార్ కథానాయికగా నటిస్తోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను, జూన్ 14వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు. ఈ సినిమాతో తెలుగులో తనకి మరిన్ని ఛాన్సులు వస్తాయని రిద్ధికుమార్ భావిస్తోంది. హీరో హీరోయిన్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి .   

  • Loading...

More Telugu News