Ludhiana: లూథియానా మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ బోల్తా.. కాంగ్రెస్‌కు తిరుగులేని విజయం

  • 92 వార్డులకు గాను 62 వార్డుల్లో కాంగ్రెస్ స్వీప్
  • పంజాబ్‌లో తిరుగులేని శక్తిగా మారిన కాంగ్రెస్
  • రెండు నెలల క్రితం జరిగిన అమృత్‌సర్, పటియాలా, జలంధర్ ఎన్నికల్లోనూ ఘన విజయం

పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బోల్తాపడింది. కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. మొత్తం 92 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 62 వార్డులను కాంగ్రెస్ స్వీప్ చేసింది. శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి కేవలం 22 వార్డులకే పరిమితమైంది. ఎల్పీ-ఏఏపీ కూటమి 8 వార్డులను దక్కించుకుంది. నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు.

అతిపెద్ద మునిసిపాలిటీ అయిన లూథియానాను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తొలి నుంచి వ్యూహాలు రచించాయి. అమృత్‌సర్, పటియాలా, జలంధర్ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన రెండు నెలల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగడంతో ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అమృత్‌సర్, పటియాలా, జలంధర్ మున్సిపల్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు లూథియాను కూడా దక్కించుకుంది. ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

More Telugu News