Raviteja: రవితేజ సినిమా హీరోయిన్ మాళవికకు గాయాలు.. షూటింగుకు విరామం

  • 'నేల టికెట్' సినిమాలో నటిస్తున్న మాళవికా శర్మ
  • రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు
  • కోలుకునేంతవరకు షూటింగ్ కు బ్రేక్
మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న 'నేల టికెట్' సినిమా ద్వారా మాళవికా శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయాలయ్యాని చిత్రయూనిట్ తెలిపింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటోంది. పర్యవసానంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఆమె కోలుకున్న తరువాత షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. 
Raviteja
malavika sharma
nela ticket

More Telugu News