Chandrababu: సినిమాలకు పెద్దగా వెళ్లను కానీ, ఆ సినిమా మాత్రం చూశాను!: సీఎం చంద్రబాబు

  • ‘బాహుబలి’ సినిమాను కుటుంబ సమేతంగా ఇంట్లోనే చూశా
  • మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటు లేదు
  • హోటల్ భోజనాలు చేయను
  • విదేశీ పర్యటనకు వెళితే మాత్రం తప్పదు : చంద్రబాబు
సినిమాలు చూడటం మొదటి నుంచి  తనకు అలవాటు లేదని, అయితే, ‘బాహుబలి’ సినిమా మాత్రం చూశానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయ జీవితంలో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు ‘ఏబీఎన్’ ఛానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, ‘బాహుబలి’ సినిమాను కుటుంబ సమేతంగా ఇంట్లోనే చూశానని, మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటు తనకు లేదని చెప్పారు. అదే విధంగా, హోటల్ భోజనాలు చేసే అలవాటు కూడా తనకు లేదని, అయితే, విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పదని చెప్పారు.
Chandrababu
bahubali

More Telugu News