nagarjuna: ఆసక్తిని రేకెత్తిస్తోన్న నాగార్జున 'ఆఫీసర్' ఫస్టులుక్

  • వర్మ దర్శకత్వంలో నాగ్ 
  • 'ఆఫీసర్' టైటిల్ ఖరారు
  •  మే 25న విడుదల  

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకి 'ఆఫీసర్' అనే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి.

 అదే టైటిల్ ను ఖరారు చేస్తూ వర్మ ఈ సినిమా ఫస్టులుక్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఆసక్తిని రేకెత్తిస్తూ ఫస్టులుక్ మోషన్ టీజర్ ను కూడా వదిలాడు. రివాల్వర్ తో షూట్ చేస్తూ నాగార్జున చాలా సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాను మే 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ఫస్టులుక్ పోస్టర్ ద్వారానే స్పష్టం చేశాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన మైరా సరీన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News