India: అమెరికా చదువు పట్ల భారతీయ విద్యార్థుల్లో తగ్గిన ఆసక్తి!

  • డొనాల్డ్‌ ట్రంప్ స‌ర్కారు తీసుకొచ్చిన వీసా నిబంధ‌న‌లు ఓ కారణం
  • 2016-2017 మధ్యకాలంలో 21 శాతం తగ్గిన విద్యార్థులు
  • గతేడాది 2,06,708 మంది విద్యార్థులు మాత్రమే భారత్ నుంచి అమెరికాకు

విదేశాల్లో విద్య అన‌గానే భార‌తీయ విద్యార్థులు మొద‌ట అమెరికాపైనే మొగ్గు చూపుతారు. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా అమెరికాకు వెళ్లే భార‌తీయ విద్యార్థుల సంఖ్య త‌గ్గింది. ఇందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స‌ర్కారు తీసుకొచ్చిన వీసా నిబంధ‌న‌లు, వర్క్‌ నిబంధనలు విద్యార్థుల సంఖ్య ప‌డిపోవ‌డానికి ఒక‌ కారణం అయితే, భారత్‌లో పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు కొరత మరోకారణం అయిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ (ఎన్‌ఎఫ్ఏపీ) చేపట్టిన అధ్యయనంలో తెలిసింది.

కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య 2016-2017 మధ్యకాలంలో 21 శాతం తగ్గింది. అలాగే భారత్ కాకుండా ఇతర దేశాల నుంచి అమెరికాలో చదువుకోవటానికి వెళ్లే వారి సంఖ్య 2016-2017 మధ్యకాలంలో 4 శాతం తగ్గింది. 2017లో 2,06,708 మంది విద్యార్థులు భారత్ నుంచి అమెరికా వెళ్లారు.  

More Telugu News