sayaji shinde: అందుకే కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు: నటుడు సాయాజీ షిండే

  • మంచి నటుడు అనిపించుకోవాలనుకున్నాను 
  • అందుకోసం 10 సంవత్సరాల పాటు కష్టపడ్డాను 
  • ఎప్పుడూ వెనక్కి వెళ్లిపోదామనిపించలేదు
తెలుగు తెరపై విలనిజాన్ని .. కామెడీ విలనిజాన్ని పండించిన నటుల్లో సాయాజీ షిండే ఒకరు. కేరక్టర్ ఆర్టిస్ట్ గాను ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ఆయన వాయిస్ లోని ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆయన పోషించే పాత్రలకు ఆయన వాయిస్ ప్రధాన బలంగా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమాలో 'తిన్నామా .. పడుకున్నామా .. తెల్లారిందా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.

 అలాంటి సాయాజీ షిండే తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు. " నేను త్వరగా ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనో .. బాగా డబ్బు సంపాదించాలనే ఆశతోనో ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు. మంచి నటుడు అనిపించుకోవాలనే ఆలోచనతో మాత్రమే వచ్చాను. అందువలన 10 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా .. విసుగు అనిపించలేదు .. వెనక్కి వెళ్లిపోదామని అనిపించలేదు" అంటూ చెప్పుకొచ్చారు.   
sayaji shinde

More Telugu News