nagarjuna: నాగార్జున మూవీ టైటిల్ 'ఆఫీసర్'?

  • వర్మ దర్శకత్వంలో నాగ్ 
  • ముంబైలోజరుగుతోన్న షూటింగ్
  • త్వరలోనే టైటిల్ ప్రకటన  

నాగార్జున కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా .. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'శివ'ను మించి ఉంటుందని వర్మ ముందుగానే చెప్పాడు. అదే విధంగా ఆయన ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

 ఈ సినిమాకి వర్మ ఎలాంటి టైటిల్ పెడతారోననే విషయంలో అందరిలోను ఆసక్తి వుంది. నాగార్జున ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అందువలన కథ ప్రకారం ఈ సినిమాకి 'ఆఫీసర్' అనే టైటిల్ ను వర్మ ఖరారు చేశాడనేది తాజా సమాచారం. ఈ సినిమాతో తెలుగు తెరకి 'మైరా సరీన్' కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ఎనౌన్స్ చేసే ఆలోచనలో వున్నారు .  

  • Loading...

More Telugu News