Telangana: తెలంగాణలో రేషన్‌ సరుకులపై నిఘా మరింత కట్టుదిట్టం

  • ప్ర‌తి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌
  • రేషన్ బియ్యంపై నిఘా మరింత కట్టుదిట్టం
  • హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం

రేషన్ సరుకులను తరలించే లారీలకు జీపీఎస్ అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల అధికారులు ప్రకటన చేశారు. రేషన్ సరుకులను అర్హులకు అందించే క్రమంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నట్లు చెప్పారు. రేషన్ సరుకుల లారీ కదలికలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించడానికి తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాటిని హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.

దీని వల్ల రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలతో పాటు గోదాముల్లో బియ్యం తరలింపును పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఈ -పాస్ విధానం ద్వారా సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థకు కీలకమైన మండల స్థాయి నిల్వ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

More Telugu News