sobhan babu: శ్రీదేవికి శోభన్ బాబు ముందుగానే చెప్పారట .. ఆమె ఆ మాట మరిచిపోలేదు!

  • శోభన్ బాబు సినిమాలో బాలనటిగా శ్రీదేవి 
  • ఆ తరువాత ఆయన సరసన కథానాయిక
  • ఈ జంట నుంచి సూపర్ హిట్స్  

వెండితెరకి బాలనటీనటులుగా పరిచయమైన చాలామంది ఆ తరువాత కాలంలో తెరమరుగయ్యారు. కానీ శ్రీదేవి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు సినిమాల్లో బాలనటిగా మెప్పించిన శ్రీదేవి, ఆ తరువాత వాళ్ల సరసనే కథానాయికగా నటించి అలరించారు. అంతేకాదు కృష్ణ .. శోభన్ బాబుల సరసన ఎక్కువ సినిమాలు చేసి .. హిట్ పెయిర్ అనుకునేలా చేశారు.

 శోభన్ బాబు 'నా తమ్ముడు ' సినిమాలో శ్రీదేవి బాలనటిగా నటించారు. ఈ సినిమాలో ఆమె నటనను దగ్గరగా చూసిన శోభన్ బాబు 'నువ్ తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతావు' అన్నారట. ఆ తరువాత కాలంలో ఆయన సరసన తొలిసారిగా ఆమె 'కార్తీకదీపం' సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ తొలిరోజున గతంలో శోభన్ బాబు అన్నమాటను గుర్తుచేస్తూ ఆయన కాళ్లకు శ్రీదేవి నమస్కరించిందట. ఆ తరువాత ఈ జంట నుంచి వచ్చిన ఎన్నో హిట్స్ ఆడియన్స్ ను అలరించాయి.   

More Telugu News