అలాంటి ప్రచారం వద్దు.. ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావచ్చు!: శ్రీదేవి మరణంపై ఏక్తా కపూర్
- శ్రీదేవి మరణంపై పుకార్లు
- సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లు
- పుకార్లను ఖండించి, బాధపెట్టొద్దన్న ఏక్తా కపూర్
చెడు ప్రచారం చేసేవాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించింది. ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండా, హృదయ పనితీరు మెరుగ్గా ఉన్న వారికి కూడా గుండెపోటు వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని ఆమె సూచించింది. ఎలాంటి హృద్రోగ సమస్యలూ లేకపోయినప్పటికీ, ప్రపంచంలో ఒక శాతం మందికి హఠాత్తుగా గుండెపోటు వస్తుందని తనకు తెలిసిన డాక్టర్ ఒకరు చెప్పిన విషయాన్ని ఏక్తా తన ట్వీట్ లో పేర్కొంది. పుకార్లు ప్రచారం చేసేవారు దీనిని గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించింది. ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, బాధపెట్టవద్దని ఆమె నెటిజన్లను కోరింది.