punjab cm: విదేశాల్లో నల్లధనం కలిగి ఉన్న సీఎం నుంచి మీరేం ఆశిస్తారు?: కేంద్ర మంత్రి హరి సిమ్రత్ కౌర్ బాదల్

  • ఎఫ్ఐఆర్ లో గురుపాల్ సింగ్ పేరు చేర్చిన సీబీఐ
  • జాబితాలో మరో 12 మంది నిందితులు
  • సీఎం కుటుంబం స్కాముల్లో ఉన్నదంటూ కేంద్ర మంత్రి ఆరోపణ

శింభోలి షుగర్స్ బ్యాంకులకు రూ.97.85 కోట్ల మేర మోసం చేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అల్లుడి పేరును సైతం నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. ఎఫ్ ఐఆర్ లో పంజాబ్ సీఎం అల్లుడు గురుపాల్ సింగ్ తోపాటు మరో 12 మంది పేర్లను పేర్కొంది.

 పంజాబ్ ముఖ్యమంత్రి అల్లుడి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడంపై శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ స్పందిస్తూ సీఎం కుటుంబం అంతా కూడా స్కాముల్లో చిక్కుకున్నదేనంటూ ఆరోపించారు. ‘‘విదేశాల్లో నల్లధనం కలిగి ఉన్న సీఎం నుంచి మీరేం ఆశిస్తారు? కుటుంబం అంతా కూడా స్కాముల్లో ఉన్నది. ఇదేం ఆశ్చర్యకరం కాదు. కాంగ్రెస్ కు ఇది గతం నుంచి ఉన్న అలవాటే’’ అని ఆమె అన్నారు.

More Telugu News