governor: దక్షిణాది రాష్ట్ర గవర్నర్ లైంగిక దుష్ప్రవర్తనపై ఫిర్యాదు... పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ!

  • మహిళా ఉద్యోగులతో చనువుగా ఉండే యత్నం
  • ఫిర్యాదులోని ఆరోపణలను తేల్చాలంటూ దర్యాప్తు సంస్థలకు ఆదేశం
  • నిజమని తేలితే రాజీనామాకు ఆదేశించే అవకాశం
  • విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం

దక్షిణాదిన ఓ రాష్ట్ర గవర్నర్ దుష్ప్రవర్తనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. రాజ్ భవన్ లో మహిళా ఉద్యోగులను గవర్నర్ తనకు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేంద్రం హోంశాఖ పెదవి విప్పలేదు. అయితే, ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ వాస్తవం ఏంటో తేల్చాలని దర్యాప్తు సంస్థలకు నివేదించినట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది.

ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నిజమేనని తేలితే సదరు గవర్నర్ ను రాజీనామా చేయాలంటూ కోరే అవకాశాలున్నాయని సమాచారం. గతంలో మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ పై ఈ తరహాలోనే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రాజీనామా కోరిన విషయం తెలిసిందే.

More Telugu News