'కుంకుమ భాగ్య' సీరియల్ నటి శిఖాసింగ్ ను రూ.11 లక్షలకు మోసగించిన వ్యక్తి
- ఘనాలో కార్యక్రమం ఉందని చెప్పి రూ.12 లక్షలకు బుక్
- అడ్వాన్సుగా రూ.70,000 చెల్లింపు
- మిగిలింది ఎగవేత
- దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన శిఖా సింగ్
ఈ కార్యక్రమం తొలుత 2017 జూలైలో జరగాల్సి ఉంది. తర్వాత నవంబర్ కు వాయిదా పడింది. తీరా కార్యక్రమం ముగిసిన తర్వాత శిఖాసింగ్ మిగిలిన పారితోషికం కోసం నిర్వాహకులను సంప్రదించింది. వారు ఆమెకు సంబంధించిన పారితోషికం మొత్తాన్ని చతుర్వేదికి ముట్టజెప్పామని చెప్పారు. ఇక అప్పటి నుంచి చతుర్వేది తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో శిఖా సింగ్ చితల్సార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 420 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.