Sridevi: శ్రీదేవి మరణంపై స్పందించిన టిబెట్ బహిష్కృత ప్రధాని!

  • ఆమెను కోల్పోయిన లక్షలాదిమందిలో నేను ఒకడిని
  • ఆమె మరణంతో నన్ను వేదనలో ముంచేసింది
  • ట్వీట్ చేసిన టిబెట్ బహిష్కృత ప్రధాని
శ్రీదేవి మరణవార్త యావత్ దేశాన్నే కాదు, పొరుగు దేశాలతోనూ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగ్గజ నటి మరణవార్త తెలిసి దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు అభిమానులు మొత్తం షాక్‌కు గురయ్యారు. దాయాది పాకిస్థాన్‌లోని ప్రముఖులు, నటులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా టిబెట్ బహిష్కృత ప్రధాని లోబ్‌సంగ్ సాంగే కూడా స్పందించారు.

శ్రీదేవి మరణవార్త తనను తీవ్ర వేదనలో ముంచేసిందని పేర్కొన్నారు. లక్షలాదిమంది ఆమె అభిమానుల్లాగే తాను కూడా ఆమెను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో శ్రీదేవి సినిమాలను తెగ చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. ‘‘లక్షలాదిమందిలాగే నేను కూడా ఆమెను మిస్సయ్యా’’ అని సాంగే ట్వీట్ చేశారు. 
Sridevi
Tibet
Lobsang Sangay
Bollywood

More Telugu News