Boney Kapoor: కాకతాళీయం! బోనీకపూర్ మొదటి భార్య మోనాకపూర్, శ్రీదేవి మృతి విషయంలో సారూప్యత

  • కొడుకును తెరపై చూసుకోకుండానే కన్నుమూసిన మోనా
  • కుమార్తె సినిమా చూడకుండానే తుదిశ్వాస విడిచిన శ్రీదేవి
  • సినిమాల విడుదలకు ముందే ఇద్దరూ మృతి చెందిన వైనం
స్క్రీన్ లెజెండ్ శ్రీదేవి (54) శనివారం రాత్రి దుబాయ్‌లో మృతి చెందారు. మేనల్లుడు మోహిత్ మార్వా వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భర్త బోనీకపూర్‌తో కలిసి వెళ్లిన ఆమె గుండెపోటుతో మరణించారు. ‘ధడక్’ సినిమా షూటింగ్‌లో ఉన్న శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. శ్రీదేవి కనుక మరో ఐదు నెలలు బతికి ఉన్నట్టయితే కుమార్తెను తెరపై చూసుకునే అవకాశం ఉండేది. జూలై 20న ఈ సినిమా విడుదల కానుంది.

విధి విచిత్రమో, కాకతాళీయమో కానీ బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ కూడా తన కుమారుడి తొలి చిత్రాన్ని చూడకుండానే కన్నుమూశారు. ఇద్దరి మరణాల్లోనూ సారూప్యత ఉంది. కేన్సర్‌తో బాధపడిన మోనా తన కుమారుడు అర్జున్ కపూర్ అరంగేట్ర చిత్రం ‘ఇష్క్‌జాదే’ విడుదలకు రెండు నెలల ముందు కన్నుమూశారు. ఈ సినిమా మే 2012న విడుదల కాగా, మోనా రెండు నెలల ముందు అంటే మార్చి 25న తుదిశ్వాస విడిచారు. మోనా మరణం కంటే శ్రీదేవి మరణం బోనీతో ఎక్కువగా కన్నీరు పెట్టిస్తోంది. మోనా కన్నుమూసినప్పుడు తన పక్కన శ్రీదేవి ఉందన్న ధైర్యంతో బోనీ ఉండేవారని, కానీ ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరూ లేరని ఆప్తులు చెబుతున్నారు.
Boney Kapoor
Sridevi
Mona Kapoor
Ishaqzaade
Dhadak

More Telugu News