Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • యంగ్ హీరో చిత్రంలో కాజల్ అగర్వాల్!
  • ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ 
  • మాతృభాషలో నిత్యా మీనన్ చిత్రం

*  ప్రస్తుతం 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్, తెలుగులో మరో చిత్రాన్ని ఇంతవరకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించే చిత్రం కోసం కాజల్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం కాజల్ తో టాక్స్ నడుస్తున్నాయి.
*  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే చిత్రం కోసం ఎన్టీఆర్ తన లుక్కును పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో తను ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం ఓ కథానాయికగా పూజా హెగ్డే ఇప్పటికే ఎంపికైంది.
*  తాజాగా నాని నిర్మించిన 'అ' సినిమాలో నటించిన కథానాయిక నిత్యా మీనన్ ఇప్పుడు మాతృభాషలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది.

More Telugu News