sridevi: శ్రీదేవి మరణంపై బాలకృష్ణ, నాగార్జునల స్పందన

  • చిత్రపరిశ్రమకు తీరని లోటు
  • ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే పలికించగల గొప్ప నటి అన్న బాలయ్య
  • శ్రీదేవి మరణాన్ని చెడు జ్ఞాపకంగానే భావిస్తానన్న నాగార్జున
శ్రీదేవి గారి హఠాన్మరం చాలా బాధాకరమని నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో కలసి నాన్నగారు ఎన్నో సినిమాల్లో నటించారని చెప్పారు. ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే పలికించగలిగిన మహానటి ఆమె అని తెలిపారు. ఆమె మృతి భారతీయ చిత్రసీమకు తీరని లోటు అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నానని తెలిపారు.

శ్రీదేవి మరణ వార్తతో షాక్ కు గురయ్యానని నాగార్జున అన్నారు. ఆమె మనల్ని ఎందుకు వదిలి వెళ్లిందో అనే విషయం గురించే ఆలోచిస్తున్నానని... ఆమె మరణం అనేది ఆమెకు సంబంధించిన ఒక చెడు కల లేదా చెడు జ్ఞాపకంగానే భావిస్తానని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 'మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం శ్రీదేవి' అంటూ ట్వీట్ చేశారు. 
sridevi
Balakrishna
Nagarjuna

More Telugu News