hyperloop: హైపర్ లూప్ ను ప్రవేశపెట్టాలనుకుంటున్నాం... రైల్వే మంత్రి పీయూష్ గోయెల్

  • ఈ టెక్నాలజీని సొంతం చేసుకునే అపూరూప అవకాశం
  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే
  • అర్హతలు కలిగిన వారికే రుణాలు

దేశంలో మరో సరికొత్త రవాణా వ్యవస్థకు బీజం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయెల్ మాటలే నిదర్శనం. ‘‘దేశంలో చివరి ఆవిష్కరణ 40 ఏళ్ల క్రితం రాజధాని రైలును ప్రవేశపెట్టినప్పుడు జరిగింది. బుల్లెట్ రైలు కేవలం ఒక టెక్నాలజీ ప్రవేశం మాత్రమే. ఇప్పుడు హైపర్ లూప్ ను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నాం. ఈ టెక్నాలజీని అక్కున చేర్చుకునే అపురూప అవకాశం భారత్ కు ఉంది. ఈ తరహా టెక్నాలజీలకు భారత్ కేంద్రం కాగలదు’’ అని ఎకనమిక్ టైమ్స్ ప్రపంచ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.

హైపర్ లూప్ అనేది భూ ఉపరితలంపైనే పైపులోపల వేగంగా తీసుకెళ్లే రవాణా టెక్నాలజీ. 100 ఏళ్ల రైల్వేను ఆధునికంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి గోయెల్ చెప్పారు. రుణాల జారీ వృద్ధి తగ్గడానికి కారణం, సరైన అర్హతలు లేని వ్యాపార సంస్థలకు రుణాలు ఇవ్వకపోవడం వల్లేనని మంత్రి చెప్పారు. యూపీఏ హయాంలో ఇష్టారీతిన ఎవరికి పడితే వారికి రుణాలు ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగిన వారికే ఇస్తున్నామని చెప్పారు.

More Telugu News