శ్రీదేవి మా ఇంట్లో పెరిగిన పిల్ల: హీరో కృష్ణ
- ఆమె మరణవార్త షాక్‌కు గురిచేసింది
- నరేశ్, శ్రీదేవి చిన్ననాటి మిత్రులు
- చెన్నైలో మా ఇంటి పక్కనే ఆమె ఇల్లు
మరో నటుడు కృష్ణంరాజు కూడా ఆమె గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆమె మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మహా నటీమణులు సావిత్రి, భానుమతి మినహా శ్రీదేవి మాదిరిగా నటించే వారు ఎవ్వరూ లేరని ఆయన కొనియాడారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటిని కోల్పోయిందని ఆయన అన్నారు. కాగా, దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.