sridevi: రాత్రి 11 నుంచి 11.30 మధ్య శ్రీదేవి చనిపోయింది: సంజయ్ కపూర్ ప్రకటన

  • అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచిన శ్రీదేవి
  • హుటాహుటిన దుబాయ్ బయల్దేరిన మరిది సంజయ్ కపూర్
  • షాక్ కు గురైన అభిమానులు
ప్రముఖ సినీనటి శ్రీదేవి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం కోసం యూఏఈలోని రస్ అల్ ఖైమాకు వెళ్లిన ఆమె... అందరినీ విడిచి నింగికెగిశారు. నిన్న రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఆమె మరిది సంజయ్ కపూర్ తెలిపారు. శ్రీదేవి మరణవార్త వినగానే ముంబై నుంచి హుటాహుటిన ఆయన దుబాయ్ బయల్దేరారు. మరోవైపు, శ్రీదేవి మరణవార్తతో ఆమె అభిమానులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు. 54 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  
sridevi
death
sanjay kapoor

More Telugu News