sridevi: అతిలోకసుందరి, సినీ నటి శ్రీదేవి కన్నుమూత.. దుబాయ్‌లో గుండెపోటుతో మృతి!

  • బాలీవుడ్ నటుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి
  • శనివారం అర్ధరాత్రి దాటాక గుండెపోటుతో మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతిలో సినీ లోకం
తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కొన్ని దశాబ్దాలపాటు చిత్రపరిశ్రమను ఏలిన ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

బాలీవుడ్ నటుడు మోమిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీకపూర్‌, చిన్న కుమార్తె ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని సంజయ్ కపూర్ ధ్రువీకరించారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన ప్రముఖులు ఆమె ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ‘దడాక్’ చిత్ర షూటింగ్‌ కారణంగా ముంబైలోనే వున్న శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి విషయం తెలిసిన వెంటనే దుబాయ్ వెళ్లిపోయినట్టు సమాచారం. శ్రీదేవి మరణవార్తతో మొత్తం సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది.
sridevi
Actress
Dubai
Tollywood
Bollywood

More Telugu News