Road Accident: బీహార్లో పాఠశాల వద్ద కారు బీభత్సం.. 9 మంది చిన్నారుల మృతి.. 24 మందికి గాయాలు

  • బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన
  • ఒక్కసారిగా అదుపుత తప్పి పాఠశాల వైపునకు దూసుకెళ్లిన కారు
  • పరారీలో డ్రైవర్
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ బొలెరో కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు తప్పి పాఠశాల వైపునకు దూసుకెళ్లడంతో తొమ్మిది మంచి చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బొలెరో కారు ఓ బీజేపీ నేతదని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆ కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు.  
Road Accident
car
bihar

More Telugu News