sidda ramaiah: కర్ణాటక సీఎంతో కలిసి వెళ్లి.. రోడ్డుపక్కన టీ తాగిన రాహుల్ గాంధీ!

  • అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలతో కాంగ్రెస్ మమేకం
  • రాహుల్ గాంధీ రోడ్‌ షో
  • మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ, ఈ సారి ఎలాగైనా గెలవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. వరుస విజయాలతో దూసుకెళుతోన్న బీజేపీ తమ తదుపరి లక్ష్యం కర్ణాటకేనని పలుసార్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపి కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప కాంగ‌్రెస్‌పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఏపీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కలిసి పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయపురలో సిద్ధరామయ్యతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన టీ తాగి, బిస్కెట్లు తిని అలరించారు. అనంతరం రోడ్ షోలో కూడా పాల్గొన్నారు.
sidda ramaiah
Karnataka
Rahul Gandhi
Congress

More Telugu News