26న కాగడాలతో నిర‌స‌న ర్యాలీ: ఏపీసీసీ

  • ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్
  • సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ర్యాలీ
  • విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ మీదుగా లెనిన్ సెంటర్ వరకు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఏపీసీసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఈ నెల 26 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏపీసీసీ నేతలు.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ మీదుగా లెనిన్ సెంటర్ వరకు కాగడాలతో నిరసన ప్రదర్శన చేయనున్నారు. ఇందులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఇందులో పాల్గొనాలని ఏపీసీసీ నేతలు పిలుపునిచ్చారు.    
Go Back to Shorts
Congress
Union Budget 2018-19
raghuveera reddy

More Telugu News