BCCI: లంక ట్రై సిరీస్‌: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్

  • ధోనీ, కోహ్లీ, పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్‌లకు రెస్ట్
  • టీమ్‌‍లో కొత్త ముఖాలకు చోటు..ధోనీ స్థానంలో పంత్?
  • మార్చి 6-18 తేదీల మధ్య ట్రై సిరీస్ నిర్వహణ

వచ్చే నెల 6-18 తేదీల మధ్య శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ-20 సిరీస్‌లో తలపడే భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. వారి స్థానంలో యువ ప్లేయర్లకు చోటు కల్పించనున్నారు. సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా టూర్ నేటితో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఈ ఐదుగురికి విశ్రాంతిని కల్పించాలని బీసీసీఐ, ప్లేయర్లు పరస్పరం సమ్మతించినట్లు తెలిసింది. వారి స్థానంలో కొత్తవారిని బీసీసీఐ సెలెక్టర్లు రేపు ఎంపిక చేయనున్నారు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషద్ పంత్‌కు అవకాశం కల్పించవచ్చు. భారత్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది. అంటే, ప్రతి జట్టూ మిగిలిన రెండు జట్లతో తప్పక తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మార్చి 18న ఫైనల్ జరుగుతుంది.

More Telugu News