Salman Khan: పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడిన పని.. అంత శక్తి నాకు లేదు!: సల్మాన్ ఖాన్

  • మా నాన్న పెళ్లికి రూ. 180 ఖర్చయింది 
  • పెళ్లికూతురును వెతకడం దగ్గర నుంచి ఖర్చు ప్రారంభమవుతుంది
  • అంత ఖర్చును భరించడం నావల్ల కాదు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు 52 ఏళ్ల వయసు వచ్చినా... ఆయన పెళ్లిపై ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది బాలీవుడ్ భామలతో సల్మాన్ అఫైర్లను కొనసాగించినా... ఏ ఒక్కటీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఇటీవల సల్మాన్ ముంబైలో జరిగిన ఓ పెళ్లికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన ప్రస్తావనను ఆయన వద్ద మరోసారి లేవనెత్తింది మీడియా. దీనికి ఆయన ఇచ్చిన సమాధానంతో అందరూ అవాక్కయ్యారు.

వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని సల్లూ చెప్పాడు. తన తండ్రి వివాహానికి రూ. 180 ఖర్చు అయిందని... ఇప్పుడు పెళ్లి అనేది లక్షల నుంచి కోట్ల రూపాయలతో ముడిపడిన అంశమని అన్నాడు. అమ్మాయిని వెతకడం దగ్గర నుంచి ఖర్చు ప్రారంభమవుతుందని... పెళ్లి తర్వాత భార్య కోసం అదే స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంత ఖర్చును భరించడం తన వల్ల కాదని, అంత శక్తి తనకు లేదని... ఈ కారణంవల్లే తాను ఇంకా ఒంటరిగా ఉన్నానని తెలిపాడు. తన సోదరి అర్పిత వివాహాన్ని కోట్లాది రూపాయల ఖర్చుతో హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలస్ లో సల్మాన్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
Salman Khan
marriage
Bollywood

More Telugu News