priya praksh varrier: సచిన్ టెండూల్కర్ తో ప్రియా వారియర్ ఫొటో!

  • ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ప్రియా వారియర్
  • 'మాణిక్య మలరాయ పూవై' పాటలో అద్భుతమైన హావభావాలు పలకించిన ప్రియ
  • సచిన్ తో దిగిన ఫొటోను పోస్టు చేసిన ప్రియా వారియర్
సోషల్ మీడియా సంచలనం ప్రియా వారియర్ టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో కలసి సందడి చేసింది. మార్చి 1న విడుదల కానున్న ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా ప్రమోషన్ నిమిత్తం, కొచ్చిలోని జవహర్‌ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐఎస్‌ఎల్‌-2018కు తన సహనటుడు రోషన్ అబ్దుల్ రహూఫ్ తో కలిసి ప్రియా వారియర్ హాజరైంది. 

ఈ సందర్భంగా అక్కడే ఉన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ లను కలిసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. కొచ్చికి రావడం వల్ల తాను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నానని, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కాగా,  ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాలో 'మాణిక్య మలరాయ పూవై' పాటలో భాగంగా ఆమె కంటితో పలికించిన హావభావాలు యువతరానికి హత్తుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ గా మారింది. 
priya praksh varrier
oru adhaar love
kochi
Sachin Tendulkar

More Telugu News