venu: అప్పుడు ఆయనే నాకు అయిదు జతల బట్టలు కొనిపెట్టారు!: కమెడియన్ వేణు

షార్ట్స్‌లో చూడండి
సినిమా రంగంలోకి అడుగుపెట్టడం .. అక్కడ గుర్తింపు తెచ్చుకోవడం అంత తేలికైన పని కాదు. ఆ విషయం తన అనుభవంలోకి వచ్చిందంటూ, తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ వేణు చెప్పుకొచ్చాడు. " కృష్ణానగర్లో  'చిత్రం' శీను దగ్గర అసిస్టెంట్ గా ఉండేవాడిని .. కొన్ని కారణాల వలన అక్కడి నుంచి బయటికి వచ్చేశాను. ఏం చేయాలో .. ఎలా బతకాలో తెలియని అయోమయ పరిస్థితి. నటుడిని కావాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది".

"పక్క రూమ్ లోనే కొత్తపల్లి శేషు అనే సినిమా జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన నా పరిస్థితి తెలుసుకుని .. తేజ చేయనున్న 'జై' సినిమా ఆడిషన్స్ కి నా ఫోటోలు పంపించారు. అక్కడి నుంచి పిలుపు వచ్చేవరకూ నాకు ఆయన సాయపడుతూ వచ్చారు. 'జై' ఆడిషన్స్ కి వెళ్లినప్పుడే అక్కడ నాకు చంద్ర .. ధన్ రాజ్ తారసపడ్డారు. ఆ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అయితే షూటింగ్ కి వెళ్లడానికి బట్టలు లేవు. దాంతో ఆయనే ఓ అయిదు జతల బట్టలు కొనిపెట్టారు. అందుకే నా కోసం ఆయనని దేవుడే పంపించాడని నమ్ముతాను" అంటూ చెప్పుకొచ్చాడు.      
Go Back to Shorts
venu

More Telugu News