Arvind Kejriwal: దర్యాప్తు సంస్థలపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్.. అమిత్ షా పాత్రను నిగ్గుతేల్చండంటూ ఆగ్రహం!

  • చీఫ్ సెక్రటరీపై దాడి కేసు విచారణలో భాగంగా కేజ్రీ ఇంటికి పోలీసులు
  • అన్ని కేసులపై ఇంతే సీరియస్ గా పని చేయాలంటూ ఆగ్రహం
  • లోయా హత్య కేసు విచారణ తీరుపై మండిపాటు
ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేలు జరిపిన దాడికి సంబంధించిన విచారణలో భాగంగా సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థలపై కేజ్రీ విరుచుకుపడ్డారు. చీఫ్ సెక్రటరీపై దాడి జరిగిందంటూ చేస్తున్న దర్యాప్తును తాను ఆహ్వానిస్తున్నానని... అయితే, ఇతర కేసుల విచారణలో కూడా ఇంతే సీరియస్ నెస్ చూపితే బాగుంటుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జి లోయా హత్య కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయని... ఆ కేసు విషయంలో కూడా ఇంతే సీరియస్ గా పని చేయాలని మండిపడ్డారు. అప్పుడు మాత్రమే దర్యాప్తు సంస్థల పనితీరును దేశ ప్రజలు ప్రశంసిస్తారని అన్నారు. 
Arvind Kejriwal
loya
amit shah

More Telugu News