Allu Arjun: హరీశ్ శంకర్ 'సీటీమార్' హీరోగా బన్నీ?

  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు'
  • ఆ తరువాత సినిమాగా 'సీటీమార్'
  • తాజాగా తెరపైకి బన్నీ పేరు  

ప్రస్తుతం శర్వానంద్ - నితిన్ కాంబినేషన్లో హరీశ్ శంకర్ ఓ మల్టీస్టారర్ ను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'దాగుడుమూతలు' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా .. మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది.

ఒక వైపున ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేస్తూనే, ఆ తరువాత ప్రాజెక్టును కూడా హరీశ్ శంకర్ లైన్లో పెడుతున్నాడు. ఈ సినిమాకి 'సీటీమార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 'దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని పాప్యులర్ పాటలో నుంచి ఈ టైటిల్ ను సెట్ చేశారు. ఇక ఈ సినిమాను బన్నీతోనే చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ టైటిల్ ఆయనకే సెట్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగే అవకాశం వుంది. 

More Telugu News