namratha sirodkar: మహేష్ బాబు భార్య నమ్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మలైకా అరోరా!

  • నేను మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి నమ్రత సీనియర్ మోడల్
  • సీనియారిటీ వల్ల నాతో దురుసుగా వ్యవహరించేది
  • మెహర్ జెస్సియా కూడా అలానే ప్రవర్తించేది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పై బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేనాటికే నమ్రత సీనియర్ మోడల్ అని చెప్పింది. ఆమెతో పాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా అగ్ర స్థానంలో ఉండేదని తెలిపింది. అయితే సీనియారిటీ కారణంగా వీరిద్దరూ తనతో చాలా పొగరుగా ప్రవర్తించేవారని వ్యాఖ్యానించింది.

బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తున్న 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్రమంలో... మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ, మలైకా ఈ విషయాలను వెల్లడించింది. తాను మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి నమ్రత, మెహర్ జెస్సియాలు టాప్ మోడల్స్ గా ఉన్నారని... దీంతో, జూనియర్ అయిన తన పట్ల వారు చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పింది. అయితే, వీరిద్దరితో కూడా ప్రస్తుతం తాను స్నేహాన్ని కొనసాగిస్తున్నానని తెలిపింది.
namratha sirodkar
mehae jessia
malaika arora
Mahesh Babu

More Telugu News